12ఏళ్లు దాటితే వ్యాక్సిన్‌.. కెనడా అనుమతి!

తాజా వార్తలు

Updated : 05/05/2021 21:29 IST

12ఏళ్లు దాటితే వ్యాక్సిన్‌.. కెనడా అనుమతి!

ఒట్టావా: కరోనా వైరస్‌పై పోరాటంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో 12 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. 12 నుంచి 15 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు ఫైజెర్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇచ్చేందుకు అనుమతిచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి నుంచి కాపాడటంతో ఆయా వయస్సు పిల్లలకు ఈ టీకా సురక్షితం,  సమర్థంగా పనిచేస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్‌ అడ్వైజర్‌ సుప్రియా శర్మ వెల్లడించారు. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

కెనడాలో ఇప్పటివరకు 12,49,950 మందికి కొవిడ్‌ సోకగా.. వారిలో 20శాతం మంది 19 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. మొత్తం కొవిడ్‌ రోగుల్లో 11,42,854 మంది కోలుకోగా.. 24,396 మంది మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 82,700 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని