పాకిస్థాన్‌కు చైనా వ్యాక్సిన్‌ సాయం

తాజా వార్తలు

Published : 21/01/2021 22:12 IST

పాకిస్థాన్‌కు చైనా వ్యాక్సిన్‌ సాయం

వెల్లడించిన పాకిస్థాన్‌ విదేశాంగశాఖ మంత్రి

ఇస్లామాబాద్‌: జనవరి 31లోగా చైనా కరోనా నిరోధక వ్యాక్సిన్‌ సైనోఫామ్‌ పాకిస్థాన్‌కు చేరనున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి తెలిపారు. చైనా 5లక్షల డోసులను పంపనున్నట్లు ఆయన గురువారం ట్విటర్‌లో తెలిపారు. చైనా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ మేరకు వెల్లడించారు. ‘‘దేశానికి నేను ఒక శుభవార్తను చెప్పాలనుకుంటున్నాను. పాకిస్థాన్‌కు 5లక్షల డోసులను ఇస్తానని చైనా మనకు మాటిచ్చింది. జనవరి 31లోగా వ్యాక్సిన్‌లు ఇక్కడికి చేరతాయి.’’ అని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌లు పంపేందుకు పాకిస్థాన్‌ ఒక విమానాన్ని బీజింగ్‌కు పంపాలని చైనా ప్రభుత్వం తెలిపిందన్నారు. మొదటి బ్యాచ్‌ వ్యాక్సిన్లను పాకిస్థాన్‌తో ఉన్న స్నేహం కారణంగా చైనా ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే చైనా తయారు చేసిన సైనోఫామ్‌ వ్యాక్సిన్‌కు పాకిస్థాన్‌ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. ఫిబ్రవరి నెలాఖరులోగా 1.1మిలియన్ల వ్యాక్సిన్‌లు చైనా అందిచనున్నట్లు ఖురేషీ తెలిపారు.

చైనా సహకారంతో పాకిస్థాన్‌లోని కాన్సినో బయోలాజిక్స్‌ సంస్థ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. మరోవైపు ఆక్స్‌ఫోర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు కూడా పాకిస్థాన్‌లో అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చారు. కాగా ఇప్పటివరకూ పాకిస్థాన్‌లో 5,27,146 కరోనా పాజిటివ్‌ కేసులు, 11,157 మరణాలు నమోదయ్యాయి.

ఇవీ చదవండి..

ఆ సమయాల్లో చెల్లింపులు చేయకండి..

ట్రంప్‌ బ్లాక్‌ చేస్తే.. బైడెన్‌ ఫాలో అయ్యారుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని