FabiFlu: గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ది తప్పే

తాజా వార్తలు

Published : 03/06/2021 14:48 IST

FabiFlu: గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ది తప్పే

చర్యలు తీసుకుంటామన్న డ్రగ్‌ కంట్రోలర్‌

దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా కొనుగోలు చేయడం, నిల్వ ఉంచడం, కరోనా బాధితులకు పంచడం.. తదితర కార్యక్రమాలు నిర్వహించిన గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ది తప్పే అని తేలిందని దిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ అధికారి హైకోర్టుకు తెలిపారు. దీనిపై సత్వర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 
 
ఆ మధ్య దిల్లీలో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో గౌతమ్‌ గంభీర్‌ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫాబి ఫ్లూ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో ఔషధాల కొరత ఉన్న సమయంలో గంభీర్‌ అంత మొత్తంలో ఫాబి ఫ్లూను ఎలా కొనుగోలు చేశారని, ఎలా పంచుతున్నారని విపక్ష పార్టీలు ప్రశ్నించారు. ఈ వ్యవహారం కాస్త దిల్లీ హైకోర్టుకు చేరింది. అటు న్యాయస్థానం కూడా గంభీర్‌పై అసహనం వ్యక్తం చేసింది. గంభీర్‌ ఉద్దేశం మంచిదే అయినా దాని వల్ల సమాజానికి నష్టం కలుగుతోందని వ్యాఖ్యానించింది. దీనిపై విచారణ జరపాలని ఔషధ నియంత్రణ అధికారిని ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన దిల్లీ డ్రగ్స్‌ కంట్రోలర్‌ నేడు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌తో పాటు ఎమ్మెల్యే ప్రవీణ్‌ కుమార్‌ కూడా కొవిడ్ ఔషధాలను అనధికారికంగా నిల్వ చేసినట్లు తేలిందని తెలిపారు. దీంతో గంభీర్‌ ఫౌండేషన్‌, ఎమ్మెల్యే, డ్రగ్‌ డీలర్లపై సత్వర చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. ఈ కేసుల్లో దర్యాప్తు పురోగతికి సంబంధించి ఆరువారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జులై 29వ తేదీకి వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని