పీఓకేను అజాద్‌ కశ్మీర్‌ అంటూ..

తాజా వార్తలు

Published : 08/03/2020 01:06 IST

పీఓకేను అజాద్‌ కశ్మీర్‌ అంటూ..

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పదోతరగతి ప్రశ్నాపత్రాల్లోని ఒక ప్రశ్న కాంగ్రెస్‌, భాజపాల మధ్య అగ్గిని రాజేశాయి. శనివారం జరిగిన పదోతరగతి సోషల్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో అజాదీ కశ్మీర్‌ను(పాక్‌అక్రమితకశ్మీర్‌) మ్యాపులో గుర్తించండంటూ,  ఒక సమాధానంగా ‘‘ఆజాద్‌ కశ్మీర్‌’’ అంటూ ఇచ్చింది. దానిని భాజపా అధికారప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ ఫోటో తీసి సామాజికమాధ్యమాలలో షేర్‌ చేశాడు. ఈ విషయంపై భాజపానాయకులు అధికార కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రంలో ఆ విధంగా రావడంపై సీఎం కమల్‌నాధ్‌ అగ్రహం వ్యక్తంచేస్తూ బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. దీనికి బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి, ప్రశ్నాపత్రంలో నుంచి ఆ రెండు ప్రశ్నలను కూడా తొలగించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రజనీష్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ ప్రాంతం సువిశాల భారతదేశంలో అంతర్భాగమన్నారు. కాంగ్రెస్‌ నేతల నిజస్వభావం బయటపడిందని, పాకిస్థాన్‌వారు పీఓకే ప్రాంతాన్ని అజాదీకశ్మీర్‌ అంటుంటారు. వారిలాగే వేర్పాటువాదంతో కాంగ్రెస్‌వాళ్లు ప్రశ్నాపత్రంలో కావాలనే ఇలాంటి ప్రశ్నలు అడిగారని దుయ్యబట్టారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని