కశ్మీర్‌లో 4జీ సేవల పునురుద్ధరణకు కమిటీ

తాజా వార్తలు

Updated : 11/05/2020 19:50 IST

కశ్మీర్‌లో 4జీ సేవల పునురుద్ధరణకు కమిటీ

కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వాన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికరణ 370 రద్దు తర్వాత అక్కడ ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలు ప్రస్తుతం పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సేవల్ని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో జమ్మూకశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శికి కూడా చోటు కల్పించాలని చెప్పింది. ఈ మేరకు పలు స్వచ్ఛంద, మీడియా సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు వేసిన పిటిషన్లను జస్టిస్‌ ఎన్‌వీ.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని