మధ్య సీట్లను ఖాళీగా ఉంచండి: డీజీసీఏ

తాజా వార్తలు

Published : 01/06/2020 22:28 IST

మధ్య సీట్లను ఖాళీగా ఉంచండి: డీజీసీఏ

దిల్లీ: సాధ్యమైనంత వరకు విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని సోమవారం డీజీసీఏ విమానయాన సంస్థలను కోరింది.  ప్రయాణికుల లోడ్, సీట్ల సామర్థ్యాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అది కూడా కుదరకపోతే ప్రయాణికులను పూర్తిగా కప్పి ఉంచే గౌన్లు లాంటి వాటిని అందించాలని, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కలిసి కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. దీనికి సంబంధించి నిపుణుల బృందం విమానయాన మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.

మధ్య సీట్లను ఖాళీగా ఉంచే అంశంపై కొద్ది రోజుల క్రితం కేంద్రం, డీజీసీఏ మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానయాన సంస్థల ఆరోగ్యం కంటే పౌరుల ఆరోగ్యం గురించే ఎక్కువ ఆందోళన చెందాలని వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి కేటాయించిన విమానాల్లో మధ్య సీట్లకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు చేయొద్దని ఆదేశించింది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కరోనా వైరస్ సోకకుండా ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని సూచిస్తూ, విమానాల్లో మాత్రం ఆ నిబంధనను ఎందుకు వర్తింపజేయరని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని