Petrol: పెట్రో మంట.. ఎడ్లబండ్లపై పెళ్లి బృందం
close

తాజా వార్తలు

Published : 22/06/2021 11:22 IST

Petrol: పెట్రో మంట.. ఎడ్లబండ్లపై పెళ్లి బృందం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వరుడితో పాటు పెళ్లి బృందం సభ్యులంతా ఎడ్లబండ్లపై పెళ్లి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. పెరిగిపోయిన పెట్రోల్‌ ధరల దృష్ట్యా ఇలా చేశామని చెప్పారు. దేవరియా జిల్లా కుషారీ గ్రామానికి చెందిన ఛోటే లాల్‌ తన గ్రామం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పక్రీ బజార్‌లో పెళ్లి మండపానికి ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చాడు. తనకు చిన్నప్పటి నుంచి ఎద్దుల బండిపై వచ్చి వివాహం చేసుకోవాలని ఉండేదని, అదీకాక ఇప్పుడు పెట్రోల్‌ ధరలు పెరిగిపోవడం చూసి కూడా ఈ ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పాడు. ఈ విధానం వల్ల సంస్కృతి, సంప్రదాయాన్ని పెంపొందించటం సహా వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతిఒక్కరూ ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని