డీఏపీపై సబ్సిడీ పెంపు.. కేబినెట్‌ పచ్చజెండా
close

తాజా వార్తలు

Published : 16/06/2021 22:33 IST

డీఏపీపై సబ్సిడీ పెంపు.. కేబినెట్‌ పచ్చజెండా

దిల్లీ: కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వ్యవసాయ పొలాల్లో పంటల సాగులో విరివిగా వాడే డై అమ్మోనియా ఫాస్పేట్‌ (డీఏపీ) ఎరువుల బస్తాపై ఇస్తున్న సబ్సిడీని భారీగా కేంద్రం పెంచింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. ఒక్కో బస్తాపై అదనంగా రూ.700 చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఈ నిర్ణయంతో కేంద్రంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. గతేడాది రూ.1700గా ఉన్న డీఏపీ 50కిలోల బస్తా ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రూ.2400కు చేరింది. ఈ నేపథ్యంలో గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఏపీపై ఇస్తున్న రాయితీని 140 శాతం పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జరిగిన తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో డీఏపీపై ఇస్తున్న రాయితీని రూ.500 నుంచి రూ.1200కు పెంచేందుకు అంగీకరించింది. దీంతో మార్కెట్లో రూ.2400 ఉన్న డీఏపీ బస్తా రైతులకు రూ.1200కే రానుంది. మరోవైపు, ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో దాదాపు రూ.79,600 కోట్లు కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని