వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరింత పెంచండి: ప్రధాని మోదీ
close

తాజా వార్తలు

Published : 17/04/2021 22:54 IST

వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరింత పెంచండి: ప్రధాని మోదీ

న్యూదిల్లీ: వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరింత పెంచాలని, అందుకు అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు.

ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు అవసరమైన అదనపు పడకలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. గతేడాది కొవిడ్‌-19ను భారత్‌ సమర్థంగా ఎదుర్కొందని,. మళ్లీ దాన్ని పునరావృతం చేయాలన్నారు. అవే నియమ, నిబంధనలు పాటిస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కరోనా కట్టడికి  స్థానిక ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. రెమ్‌డెసివర్‌ సహా ఇతర ఔషధాల సరఫరాను పెంచాలని అధికారులను ఆదేశించారు. కొత్త మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లకు అనుమతులు వేగవంతం చేయాల్సిందిగా సూచించారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ వ్యాక్సిన్‌ తయారు చేయాలని, రెమ్‌డెసివర్‌ సహా ఇతర ఔషధాల తయారీలో వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించాలన్నారు. డిమాండ్‌కు తగినట్లు భారత ఔషధ తయారీ సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని పేర్కొన్న మోదీ..  కరోనా కట్టడి కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, రాష్ట్రాలు కూడా కలిసి పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని