విజయవంతంగా కరోనా కొత్త వైరస్‌ వృద్ధి

ప్రధానాంశాలు

Published : 03/01/2021 04:31 IST

విజయవంతంగా కరోనా కొత్త వైరస్‌ వృద్ధి

భారత వైద్య పరిశోధన మండలి వెల్లడి

దిల్లీ: బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్‌ను భారత్‌లోని ప్రయోగశాలలో విజయవంతంగా వృద్ధిచేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) శనివారం తెలిపింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ సార్స్‌కోవ్‌-2 బ్రిటన్‌ రకాన్ని(వేరియంట్‌) వేరుచేయలేదని, వృద్ధి చేయలేదని ఐసీఎంఆర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ‘‘బ్రిటన్‌ నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)లో కొత్త వైరస్‌ను విజయవంతంగా వేరుచేశాం. వృద్ధి చేశాం’’ అని వివరించింది. ఇందుకోసం ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీ శాస్త్రవేత్తలు వెరో సెల్‌ లైన్స్‌ని ఉపయోగించినట్లు తెలిపింది.
చెన్నై స్టార్‌ హోటల్‌లో 85 మందికి పాజిటివ్‌
చెన్నై: విలాసవంతమైన ఐటీసీ గ్రాండ్‌ కోలా హోటల్‌ కరోనా కోరల్లో చిక్కుకుంది. ఈ హోటల్‌లో 85 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైందని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ తెలిపారు. వీరిలో హోటల్‌ సిబ్బందీ ఉన్నారన్నారు. మొత్తం 609 నమూనాలు సేకరించామని ఆయన చెప్పారు. దీంతో హోటల్‌లోని అతిథులందరికీ పరీక్షలు నిర్వహించాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూనే అన్ని కార్యక్రమాలు నిర్వహించామని ఐటీసీ గ్రాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన