30 డ్రోన్లు.. రూ.22 వేల కోట్లు!

ప్రధానాంశాలు

Published : 11/03/2021 04:41 IST

30 డ్రోన్లు.. రూ.22 వేల కోట్లు!

అమెరికాతో భారీ ఆయుధ ఒప్పందం

దిల్లీ: భారత్‌ త్వరలో అత్యంత ఖరీదైన ఆయుధ ఒప్పందం అమెరికాతో చేసుకోనుంది. ఆ దేశం నుంచి సుమారు 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 22 వేల కోట్లు) విలువైన అత్యాధునిక, శక్తిమంతమైన 30ఎంక్యూ-9బీ సైనిక డ్రోన్లను కొనుగోలు చేయనుంది! అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల కాలేదు. అయితే ఇప్పటికే శాండియాగోలోని జనరల్‌ ఆటమిక్స్‌ సంస్థతో ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ భారీ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.   ఒక్కో ఎంక్యూ-9బీ డ్రోన్‌.. 48 గంటలు గాలిలో ప్రయాణించగలదు. 1700 కేజీల పేలుడు పదార్థాలను మోయగలదు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన