దలైలామాను అతిపెద్ద శత్రువుగా చూస్తున్న చైనా

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 06:07 IST

దలైలామాను అతిపెద్ద శత్రువుగా చూస్తున్న చైనా

డ్రాగన్‌కు భారత్‌, అమెరికా అడ్డుకట్ట వేయాలి
 
టిబెట్‌ నేత డోర్జీ డమ్‌డుల్‌

దిల్లీ: ఆధ్యాత్మిక గురువు దలైలామాను అతిపెద్ద శత్రువుగా చైనా చూస్తోందని, ఆయన్ని గెలవలేమన్న విషయం కూడా డ్రాగన్‌కు తెలుసునని టిబెట్‌ నేత, దిల్లీలోని టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషె డోర్జీ డమ్‌డుల్‌ పేర్కొన్నారు. చైనా దురాక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి భారత్‌, అమెరికా కలిసి ముందుకు రావాలని ఆయన కోరారు. ఆయన ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను దిల్లీలో కలవడంపై కొంత వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనొక టీవీ ఛానల్‌తో ముఖాముఖి మాట్లాడారు. సామాన్యుని దృష్టిలో ప్రపంచమంతా దలైలామా వెనుకే ఉందని, చైనా పక్షాన కాదని చెప్పారు. ‘టిబెట్‌ పౌరులు తుపాకీ నీడలో ఉన్నారు. దలైలామా గురించి వారు ఏదైనా చెబితే అరెస్టు ఖాయం. టిబెట్‌ రాజధాని లాసాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇటీవల సందర్శించినప్పుడు ప్రజలు భయంతోనే స్వాగతించారు. ఈరోజు టిబెట్‌లో జరుగుతున్నదానిని ప్రపంచం అడ్డుకోకపోతే అదే పరిస్థితి అనేక ఇతర దేశాలకూ ఎదురుకావచ్చు. చైనా విస్తరణ వాదానికి నియంత్రణ లేకుండా పోతోంది. సైనిక సంపత్తిలో, ఆర్థిక రంగంలో అమెరికాను గానీ చైనా అధిగమిస్తే ప్రపంచమంతా డ్రాగన్‌ గుప్పిట్లో ఉంటుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన