ట్రిపుల్‌ తలాఖ్‌పై కేసు

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:57 IST

ట్రిపుల్‌ తలాఖ్‌పై కేసు

ఠాణె: ముమ్మారు తలాఖ్‌ చెప్పి భార్యకు ఫోను ద్వారా విడాకులు ఇచ్చాడన్న అభియోగంతో మహారాష్ట్రలో ఠాణె జిల్లా డోంబివలి నగరంలోని తిలక్‌ నగర్‌ పోలీసులు దిల్లీ వాసి అబ్దుల్‌ వహాబ్‌ఖాన్‌పై గురువారం కేసు నమోదు చేశారు. ఠాణె జిల్లాలోని కల్యాణ్‌కు చెందిన ఫిర్యాదితో 2006లో వహాబ్‌ఖాన్‌ పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.  మూడు రోజుల కిందట భార్యకు ఫోను చేసిన నిందితుడు తాను పునర్వివాహం చేసుకొంటున్నట్లు తెలిపి, ఫోనులోనే ముమ్మారు తలాఖ్‌ పలికాడు. 2019లో ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం మేరకు ఈ విడాకుల విధానం చెల్లదు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన