సింధు పరాజయం

ప్రధానాంశాలు

Published : 23/10/2021 03:48 IST

సింధు పరాజయం

డెన్మార్క్‌ ఓపెన్‌

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు, యువ ఆటగాడు సమీర్‌ వర్మ క్వార్టర్‌ఫైనల్స్‌లో ఓడిపోయారు. శుక్రవారం మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ సింధు 11-21, 12-21తో అయిదో సీడ్‌ యాన్‌ సియంగ్‌ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుపై అన్ని రంగాల్లోనూ ప్రత్యర్థి పైచేయి సాధించింది. షటిల్‌పై నియంత్రణ లేకపోవడం.. అనవసర తప్పిదాలు సింధుకు నష్టం చేశాయి. ఇప్పటి వరకు వీరిద్దరు 2 సార్లు తలపడగా.. రెండింట్లోనూ సియంగ్‌ గెలుపొందింది. మరోవైపు సమీర్‌ వర్మను గాయం ఇబ్బందిపెట్టింది. టామి సుగియార్టో (ఇండోనేషియా)తో క్వార్టర్‌ఫైనల్లో 17-21తో తొలి గేమ్‌ ఓడిన సమీర్‌ గాయం కారణంగా ఆ తర్వాత మ్యాచ్‌ నుంచి నిష్క్రమించాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన