ముంబయి దాడుల సూత్రధారి
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

ముంబయి దాడుల సూత్రధారి

హఫీజ్‌ సయీద్‌ ఇంటి వద్ద బాంబు పేలుడు

ముగ్గురి మృతి.. 20 మందికి గాయాలు

లాహోర్‌: ముంబయి దాడుల సూత్రధారి, నిషేధిత జమాత్‌ ఉద్‌ దువా (జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్‌ (71) నివాసం వద్ద బుధవారం శక్తిమంతమైన కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. దాదాపు 20 మంది గాయపడగా.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు జిన్నా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో  పోలీసులు కూడా ఉన్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. సయీద్‌ ఇంటి కిటికీలు, గోడలు కూడా దెబ్బతిన్నట్టు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. 2008 నాటి ముంబయి దాడుల్లో ఆరుగురు అమెరికన్లతోపాటు 166 మందిని పొట్టన బెట్టుకొన్న లష్కర్‌ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు జేయూడీ మూలం. ఈ పేలుడు జరిగినపుడు సయీద్‌ ఇంట్లోనే ఉన్నట్టు వదంతులు వచ్చాయి. లాహోర్‌లోని జౌహర్‌ టౌనులో ఉన్న సయీద్‌ ఇంటి బయట పోలీస్‌ పికెట్‌ కొనసాగుతుండగా దాడి జరిగింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేస్తున్నాడన్న అభియోగంపై సయీద్‌ ప్రస్తుతం కోట్‌ లఖ్పత్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.  కారు బాంబు దాడిలో 30 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు వాడినట్టు విచారణ సంస్థలు ప్రాథమిక నివేదికలు రూపొందించాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన