గాజీపుర్‌లో బీకేయూ ఆందోళన

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 05:46 IST

గాజీపుర్‌లో బీకేయూ ఆందోళన

భారీగా పోలీసు బలగాల మోహరింపు

ఈనాడు, లఖ్‌నవూ: కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) ఆధ్వర్యంలో రైతులు బులంద్‌షహర్‌ నుంచి ట్రాక్టర్లలో, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరి గాజీపుర్‌ సరిహద్దుకు చేరుకున్నారు. తొలుత బులంద్‌షహర్‌లో సమావేశమై ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి గాజీపుర్‌ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేసే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని బీకేయూ నాయకులు స్పష్టం చేశారు. రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు గంటల తరబడి బైఠాయించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన