దేశంలో వాస్తవ పరిస్థితి అదే!

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:18 IST

దేశంలో వాస్తవ పరిస్థితి అదే!

ప్రపంచ ఆకలి సూచీ-2021లో భారత్‌ ర్యాంకు పడిపోవడంపై ఆక్స్‌ఫామ్‌
జిహెచ్‌ఐ నివేదికకు సమర్థన

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తదనంతరం భారత్‌లో పౌషకాహార లోపం సమస్య తీవ్రమయ్యిందని, ప్రపంచ ఆకలి సూచీ-2021లో దేశ ర్యాంకు 101వ స్థానానికి పడిపోవడం వాస్తవ పరిస్థితినే ప్రతిబింబించిందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా తెలిపింది. మొత్తం 116 దేశాల్లోని పరిస్థితులపై వెలువడిన ప్రపంచ ఆకలి సూచీ(జిహెచ్‌ఐ)లో 2020లో భారత్‌ 94వ స్థానంలో ఉండగా ఈ ఏడాది నివేదికలో ఏడు స్థానాలు దిగువున 101వ స్థానానికి పడిపోయింది. పొరుగునున్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లు మన దేశానికి కన్నా మెరుగైన స్థితిలో నిలిచాయి. ఆక్స్‌ఫామ్‌ నివేదికపై కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ నివేదిక దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉందని, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంది. నివేదిక రూపొందించిన పద్ధతి విశ్వసనీయంగా లేదని తెలిపింది. తమ సంస్థ వెల్లడించిన చ్కీజీజిహెచ్‌ఐ నివేదికను ఆక్స్‌ఫామ్‌ ఇండియా సమర్థించుకుంది. ‘దేశంలో పోషకాహార లోపం సమస్య కొత్తదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) విడుదల చేసిన సమాచారం ఆధారంగానే నివేదిక రూపొందింది’ అని పేర్కొంది. 2015-19 మధ్య పుట్టిన చిన్నారుల్లో పౌషకాహార లోపం అంతకుముందు తరంవారి కన్నా అధికంగా ఉందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా సీఈవో అమితబ్‌ బెహర్‌ తెలిపారు. చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో 2017లో పోషణ్‌ అభియాన్‌ను ప్రారంభించినా నిధుల కొరతతో సక్రమంగా అమలు జరగలేదన్నారు. పోషణ్‌ 2.0 పథకానికి నిధుల పెంపు విషయాన్ని ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ ప్రస్తావించిందని గుర్తు చేశారు. 2020-21లో కేటాయించిన నిధులతో పోల్చితే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం కేటాయించిన నిధులు 18.5శాతం మేర తగ్గాయన్నారు. పోషణ్‌ పథకానికి ప్రస్తుత బడ్జెట్‌ మొత్తంలో చూపిన నిధుల శాతం 0.57 మాత్రమేనని పేర్కొన్నారు. దేశంలో వయోజనులు, చిన్నారులు తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ‘ప్రపంచ పౌష్టికాహార ప్రమాణాల్లో మన దేశంలోని కిశోరప్రాయ, నడివయసు మహిళలు ఎంతో దిగువన ఉన్నారు. దేశంలోని సగం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు’ అని ఆక్స్‌ఫామ్‌ ఇండియా పేర్కొంది. భారత్‌కు లభించిన జిహెచ్‌ఐ స్కోరు 2000 సంవత్సరంలో 38.8 పాయింట్లు కాగా 2012-2021 మధ్య కాలంలో అది 28.8 నుంచి 27.5కు తగ్గిపోయింది. ప్రపంచ ఆహార సూచీని ఐరిష్‌ ఎయిడ్‌ ఏజెన్సీ అయిన ‘కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌’, జర్మనీకి చెందిన ‘వెల్ట్‌ హంగర్‌ హిల్ఫే’ సంస్థ సంయుక్తంగా రూపొందించాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన