ఇటలీ, బ్రిటన్‌లలో 29 నుంచి మోదీ పర్యటన

ప్రధానాంశాలు

Updated : 25/10/2021 10:16 IST

ఇటలీ, బ్రిటన్‌లలో 29 నుంచి మోదీ పర్యటన

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి నవంబరు రెండో తేదీ వరకు ఇటలీ, బ్రిటన్‌లలో పర్యటించనున్నారు. 30, 31 తేదీల్లో రోమ్‌లో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో అఫ్గానిస్థాన్‌ సమస్య ప్రధానంగా చర్చకు రానుంది.

అనంతరం బ్రిటన్‌లోని గ్లాస్గో వెళ్లి పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన కాప్‌-26 సదస్సులో పాల్గొంటారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. నవంబరు 1, 2 తేదీల్లో జరిగే ప్రపంచ నాయకుల సదస్సు (వరల్డ్‌ లీడర్స్‌ సమ్మిట్‌-డబ్ల్యుఎల్‌ఎస్‌)లో ప్రసంగిస్తారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన