close

తాజా వార్తలు

విటమిన్‌ బి12 అందుతుందా?

రక్తహీనతను నివారించడంతోపాటు ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచడానికి విటమిన్‌ బి12 ఉపయోగపడుతుంది. ఇది తగినంతగా లభించే ఆహారాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు అందిస్తే.. అనారోగ్యాల ముప్పును తప్పించుకోవచ్ఛు అవేంటో తెలుసుకుందాం.

* మాంసాహారంలో ఉండే బి విటమిన్‌లు శరీరానికి మేలు చేస్తాయి. కాలేయం నుంచి ఎక్కువ మొత్తంలో బి12 విటమిన్‌ శరీరానికి అందుతుంది.

* సముద్రపు ఆహారం నుంచీ ఇది లభిస్తుంది. ముఖ్యంగా చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే బి12తో పాటు ఎక్కువ మొత్తంలో అందే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

* శాకాహారులైతే పాలు, పాల పదార్థాలను రోజూ తీసుకోవాలి. వెన్న తీయని పాలు, పెరుగు, జున్ను వంటి వాటిలో బి12 లభిస్తుంది. తాజా కూరగాయల్లోనూ కొద్దిమొత్తంలో ఉంటుంది.

* రోజూ గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన విటమిన్‌ బి, మాంసకృత్తులు అందుతాయి. మాంసాహారం అంటే ఇష్టపడనివారు గుడ్డుని ఎంచుకుంటే బి2, బి12 లభిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.