close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. సాక్షులను జగన్‌ ప్రభావితం చేయొచ్చు:సీబీఐ

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంలో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. జగన్‌ జైల్లో ఉన్నప్పుడే తన బలాన్ని ప్రదర్శించి సాక్షులను ప్రభావితం చేశారని.. ఒక ప్రభుత్వాధినేతగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ఇప్పుడు మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దేశమంతా ఎన్‌ఆర్‌సీ జాబితా రూపొందిస్తాం

జాతీయ పౌర పట్టికను (ఎన్‌ఆర్‌సీ) దేశమంతా రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిషా స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్నవారిని తరిమే వరకూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. మంగళవారం ఆయన కోల్‌కతాలో దుర్గ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్‌ఆర్‌సీని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించినా భాజపా దాన్ని అమలు చేసి తీరుతుందని ఉద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జలసంరక్షణలో  ప్రథమస్థానంలో కడప

నీటి సంరక్షణలో తెలుగు రాష్ట్రాలు సత్తాచాటాయి. టాప్-10లో మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సత్తా చాటింది. దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. నీటి సంరక్షణకోసం జలశక్తి అభియాన్‌ను ప్రారంభించిన కేంద్రం తాజాగా ర్యాంకులు ప్రకటించింది. ఇందులో కడప జిల్లా 82.16 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా 78.27 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హుజూర్‌నగర్‌ ఎన్నిక: సీపీఎంకు షాక్‌!

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఎంకు షాక్‌ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేనందున సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై సీపీఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రూ.1500 జియో ఫోను కేవలం రూ.699కే..!

ఆరంభంతోనే ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో సంస్థ పండగల వేళ మరో కొత్త ఆఫర్‌ ప్రకటించింది. ప్రస్తుతం రూ.1500గా ఉన్న జియో ఫోన్‌ను దసరా, దీపావళి పండగల సందర్భంగా రూ.699 ప్రత్యేక ధరకు విక్రయించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. నిబంధనలేవీ లేకుండా ఈ ప్రత్యేక ధరతో రూ.800 ఆదా చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మన ప్రధానికి దౌత్యధర్మం నేర్పండి!

‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జై శంకర్‌ వివరణ ఇవ్వడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దీనిపై ఆయన ట్వీటర్‌ ద్వారా తీవ్రంగా స్పందించారు. ‘మన ప్రధాని అసమర్థతను కప్పిపుచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన చేసిన వ్యాఖ్యలతో డెమోక్రాట్లు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. కానీ దీన్ని మీ జోక్యంతో సద్దుమణిగించారు. మీరు దగ్గరున్నప్పుడు ఆయనకు కాస్త దౌత్య ధర్మాన్ని నేర్పండి’ అంటూ తీవ్రంగా ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉగ్రవాదులకు ఇమ్రాన్‌ రోల్‌ మోడల్‌

ఐరాస సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మాట్లాడిన తీరుపై భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తనదైన శైలిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలోనూ ఇమ్రాన్‌ ఖాన్‌ను ఎద్దేవా చేస్తూ ఆయన విమర్శలు చేశారు. ఉగ్రవాదులకు ఇమ్రాన్‌ ఖాన్‌ రోల్‌ మోడల్‌ అని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాను ఎవ్వరూ ఏం చేయలేరు

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి 70ఏళ్లయిన సందర్భంగా బీజింగ్‌లోని తియన్మాన్‌ స్వ్కేర్‌లో అతి పెద్ద పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, హైటెక్ డ్రోనులతో సుమారు 15వేల బృందాలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. ‘70’ ఆకారంలో విమానాలు విన్యాసాలు చేశాయి. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరేడ్‌గా ఆ దేశ మీడియా వర్ణించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌కు మరో ఎదురుదెబ్బ:హార్దిక్‌కు గాయం

కోహ్లీసేనకు మరో ఎదురుదెబ్బ! టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి వెన్నుపూస కింది భాగంలో గాయం మళ్లీ తిరగబెట్టిందని సమాచారం. దీంతో పాండ్య క్రికెట్‌కు చాలాకాలం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్ను గాయంతో బాధపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రకృతి అందాలతో అలరారుతున్న ‘దివిసీమ’


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.