
తాజా వార్తలు
మాజీ మంత్రి దేవినేని
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఉదయం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దైవకార్యాల్లో నియమనిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వ్యవహార శైలి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా శుక్రవారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారని మండిపడ్డారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి పట్టువస్త్రాలు ఇవ్వాల్సి ఉండగా.... దిల్లీ పర్యటన ఉందని ముందే ఇవ్వడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రావణ పాలనకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. జలాశయాల్లో నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్నా అసమర్థతతో సముద్రం పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కమీషన్ల కక్కుర్తి కోసం పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపుకు కుట్ర పన్నుతున్నారని, రైతుల ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని దేవినేని హెచ్చరించారు. వైకాపా అరాచకాలతో ఓ మహిళా ఎంపీడీవో రోడ్డెక్కి నిరసనకు దిగినా పోలీసులు పట్టించుకోరా? అని నిలదీశారు. 6.5లక్షల మంది ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందాల్సి ఉండగా ఆ సంఖ్యను భారీగా కుదించారని దుయ్యబట్టారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
