
తాజా వార్తలు
చెన్నై: చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భారత పర్యటనను పురస్కరించుకుని చెన్నైకు చెందిన 2వేల మంది పాఠశాల విద్యార్థులు ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికారు. జిన్పింగ్ మాస్క్లు, ఎరుపు రంగు టీ షర్టులు ధరించి చైనీస్ భాషలో వెల్కమ్ అనే అక్షరాల ఆకారంలో కూర్చున్నారు. దాని వెనకే హార్టీ వెల్కమ్ అనే పసుపు రంగు అక్షరాలను అలంకరించారు. దీనికి వెనకవైపున చైనా అధ్యక్షుడి ఫోటోను ఉంచారు. వాటికి ఇరువైపులా విద్యార్థులు ఎరుపు జెండాలను పట్టుకొని కూర్చున్న ఫోటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
అక్టోబరు 11, 12న జిన్పింగ్ భారత్లో పర్యటించనున్నారు. మోదీతో భేటీ కానున్నారు. గతేడాది ఏప్రిల్లో ఇరువురు నేతలు చైనాలోని వూహాన్లో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఈ సమావేశం భారత్లో జరగనుంది. ఈ భేటీకి చెన్నై సమీపంలోని చరిత్రాత్మక నగరం మహాబలిపురంలో వేదిక కానుంది. ఈ పర్యటనకు సంబంధించి చెన్నై విమానాశ్రయంలో భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, భౌగోళిక అంశాలు చర్చకు రానున్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
