close

తాజా వార్తలు

ఆసక్తికరంగా ‘కేసరి’ ట్రైలర్‌

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కేసరి’. 1891లో జరిగిన సారాగడి యుద్ధంలో పాల్గొన్న హవీల్దార్‌ ఇషార్‌ సింగ్‌ పాత్రలో అక్షయ్‌ నటిస్తున్నారు. అనురాగ్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతి చోప్రా కథానాయిక. కాగా.. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ‘నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటిష్‌ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ అక్షయ్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది.

సారాగడి ప్రాంతంలో 21 సిక్కులకు పదివేల మంది అఫ్ఘానీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎందుకు సంభవించింది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ. ట్రైలర్‌లో అక్షయ్‌కుమార్ పోరాట సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ‘నేను ధరించిన ఈ తలపాగా కేసరి (కాషాయం), కారుతున్న నా నెత్తురు కేసరి..’ అంటూ అక్షయ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మార్చి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.