close

తాజా వార్తలు

ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల తేదీ ఖరారు

హైదరాబాద్‌: ఎన్నో వివాదాల తర్వాత ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో ఏపీ మినహా అన్ని చోట్లా విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విడుదలను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను ఆపారు. కాగా ఇప్పుడు మే 1న సినిమాను ఏపీలో విడుదల చేయబోతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు.
ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు వర్మ తెలిపారు. కన్నడ నటి యజ్ఞ శెట్టి ఇందులో లక్ష్మీ పార్వతి పాత్రను పోషించారు. ఎన్టీఆర్‌గా రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటించారు. రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి సినిమాను నిర్మించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.