Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143910
            [news_title_telugu_html] => 

చిన్నారుల రక్షణకో కిట్‌

[news_title_telugu] => చిన్నారుల రక్షణకో కిట్‌ [news_title_english] => Kit For children [news_short_description] => చిన్నారి బాలికలకు ఏదో రూపంలో నిత్యం లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి.  సమీప బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారు, వాచ్‌మెన్లు.. ఇలా పిల్లలకు దగ్గరగా ఉండేవారే  ఘాతుకాలకు [news_tags_keywords] => Child,Game,Kit,Protection [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 08:45:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిన్నారుల రక్షణకో కిట్‌ - Kit For children - EENADU
close

తాజా వార్తలు

చిన్నారుల రక్షణకో కిట్‌

దిల్లీ: చిన్నారి బాలికలకు ఏదో రూపంలో నిత్యం లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి.  సమీప బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారు, వాచ్‌మెన్లు.. ఇలా పిల్లలకు దగ్గరగా ఉండేవారే  ఘాతుకాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తుల బారిన పడకుండా పిల్లలకు అవగాహన కల్పించేందుకు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఆర్‌పీ)తో కలిసి ఐఐటీ కాన్పూర్‌ ఒక కిట్‌ను రూపొందించింది. ఆటలు, యానిమేషన్‌ చిత్రాల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించే విధంగా ఈ కిట్‌ ఉంటుంది.

కిట్‌ ఇలా 
చిన్న పిల్లలు సులభంగా అర్థం చేసుకునేవిధంగా ఈ కిట్‌ ఉంటుంది. ఇందులో కొన్ని కార్డులు, పోస్టర్లు, తక్కువ నిడివి గల యానిమేషన్‌ చిత్రాలు, చిన్నచిన్న ఆటలు ఉంటాయి. వీటి సాయంతో పాఠశాల ఉపాధ్యాయురాలు లేదా స్వచ్చంద సంస్థ ప్రతినిధులు పిల్లలతో ముఖాముఖిగా సంభాషిస్తూ (వర్క్‌షాపులు నిర్వహిస్తూ) వారికి అవగాహన కల్పించవచ్చు.
ఈ కిట్‌ 8-12 ఏళ్లలోపు పిల్లలకు అవగాహన కల్పించవచ్చు. ఒకే సారి ఒక తరగతి గదిలో ఉండే 30-35 మంది విద్యార్థులకు బోధించవచ్చు. దీంతో వారికి తమ శరీరం పట్ల, వ్యక్తిగత భద్రతపై అవగాహన పెరుగుతుంది.

 

కిట్‌లో ఉండే గేమ్‌కార్డులను ఉపయోగించుకొని పిల్లలతో పెద్దలు మాట్లాడటం వల్ల పిల్లలు ఏ మేరకు అవగాహన చేసుకున్నారన్నది అంచనా వేయవచ్చు.

తమ సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకునేలా పిల్లలకు తర్ఫీదు ఇవ్వడానికి ఈ కిట్‌ ఉపయోగపడుతుంది. రాంచీలోని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రీలో ఈ కిట్‌ ను మరోసారి పరిశీలించి తుది వెర్షన్‌ విడుదల చేయనుంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.