Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 119000456
      [news_title_telugu_html] => 

పాపం పండింది

[news_title_telugu] => పాపం పండింది [news_title_english] => [news_short_description] => హుకుంపేట మండలం గుడుగుబిల్లికి చెందిన నాగేరి కాంతమ్మ(32)కు ఆరిలోవకు చెందిన జన్నం ఆనంద్‌తో పాడేరు బస్టాండులో పరిచయమైంది.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 2gTOPXgxvvE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 09:15:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పాపం పండింది - EENADU
close

తాజా వార్తలు

పాపం పండింది

 

పసివాళ్లతో వ్యాపారం
కిడ్నాప్‌ చేసి  విక్రయిస్తున్న ముఠా

అప్పుడే పుట్టిన పసికందుల నుంచి రెండేళ్ల లోపు పిల్లలను చూస్తే వారికి కన్ను కుట్టేస్తుంది. ఏదో మాయ చేసి వారిని ఇట్టే తమ బుట్టలో వేసేసుకుంటారు. అయినకాడికి అమ్మేస్తారు. ఆపై జల్సాలు చేసేస్తారు. ఆ డబ్బు ఖర్చయిపోయే సరికి మళ్లీ మరో బిడ్డపై వల విసురుతారు. ఇదీ ఆ ముఠా నేరాల తీరు. నలుగురు సభ్యుల ముఠాను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించేసరికి ఎక్కడెక్కడ పిల్లలను అపహరించిందీ.. ఎవరెవరికి విక్రయించిందీ చిట్టాను బయటపెట్టారు.

పూర్ణామార్కెట్‌: కేసు నెంబర్‌: 1 తేదీ: ఆగస్టు 5, 2019 హుకుంపేట మండలం గుడుగుబిల్లికి చెందిన నాగేరి కాంతమ్మ(32)కు ఆరిలోవకు చెందిన జన్నం ఆనంద్‌తో పాడేరు బస్టాండులో పరిచయమైంది. వీరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. కాంతమ్మ ఆగస్టు 5న సింహాచలం వస్తున్నానని ఆనంద్‌కి ఫోన్‌ చేసి చెప్పింది. వాళ్లను సింహాచలం తీసుకొచ్చేందుకు అతను ఆటో వేసుకుని నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కాంతమ్మతో పాటు ఆమె రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అప్పటికే పిల్లల అపహరణలో ఆరితేరిపోయిన ఆనంద్‌ కళ్లు ఆ పసివాడిపై పడ్డాయి. వాళ్లిదర్నీ సింహాచలం తీసుకొచ్చాడు. అవకాశం కోసం ఎదురుచూశాడు. తొలి పావంచా వద్దకు రాగానే కాంతమ్మ వాష్‌రూమ్‌కు వెళ్లొస్తాను బిడ్డను చూస్తూ ఉండమని చెప్పింది. అంతే.. ఆమె అలా వెళ్లిందోలేదో.. కుమారుణ్ని ఆటోలో ఎక్కించుకుని పరారయ్యాడు. బిత్తరపోయిన కాంతమ్మ పోలీసులను ఆశ్రయించింది. సెల్‌ టవర్‌ లోకేషన్, కాల్‌ డేటా ఆధారంగా నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అపహరణకు గురైన బాలుణ్ని కాంతమ్మకు అప్పగించారు. అయినా ఆనంద్‌పై పోలీసుల్లో అనుమానాలు వీడలేదు. మరింత లోతుగా విచారించగా మరెన్నో అపహరణల చిట్టా బయటపడింది. ఈ నేరాలు చేస్తోంది ఆనంద్‌ ఒక్కడే కాదు.. మరో ముగ్గురు నిందితులు, ఇద్దరు మధ్యవర్తులు అతని వెనుక ఉన్నారని తేలింది.

కేసు నెంబర్‌: 2 సంవత్సరం: 2016, నవంబరు

ఆరిలోవకు చెందిన బోండా నాగమణి ఆ ప్రాంతంలో పలు అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడేది. ఆమెకు ఓ రిటైర్డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కుమారుడు తమ్మినేని సుమంత్‌కుమార్‌ పరిచయమయ్యాడు. ఏలూరులో ఉంటోన్న తన సోదరి సత్యవతికి పిల్లలు లేరని సుమంత్‌కి చెప్పింది. విజయనగరం, విశాఖల్లో అనాథాశ్రమాలు తిరిగి బిడ్డను దత్తత తీసుకునేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో పిల్లల్ని అపహరించాలని ప్రయత్నాలు ప్రాంభించారు. 2016 నవంబరులో అర్ధరాత్రి వుడా పార్కు వద్ద నడకదారిపై పడుకుని ఉన్న ఓ యాచకురాలి నుంచి ఆమె 8 నెలల బాలికను అపహరించారు. మడగళ లక్ష్మి అనే మహిళతో కలిసి ముగ్గురూ కారులో ఏలూరు వెళ్లారు. అక్కడ ఉంటున్న నాగమణి సోదరి సత్యవతికి రూ. 50 వేలకు విక్రయించారు.

కేస్‌ నెంబర్‌: 3 సంవత్సరం: 2017

తన తల్లి ఆరోగ్యం బాగాలేదని సుమంత్‌కుమార్‌ సొంతూరు విజయనగరం వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న నాగమణికి హైదరాబాద్‌కి చెందిన జన్నం ఆనంద్‌ పరిచయమయ్యాడు. అతను 2017లో ఆరిలోవ ప్రాంతానికి మకాం మార్చాడు. నాగమణి చేస్తోన్న అసాంఘిక కార్యకలాపాలకు అతను చేదోడుగా ఉండేవాడు. ఆమె పిల్లలను అపహరించి విక్రయిస్తుందనే విషయాన్ని తెలుసుకున్నాడు. తనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి తన మూడో కుమార్తెను ఆమె ద్వారా మహమ్మద్‌ జియావుద్దీన్‌ అనే వ్యక్తికి రూ. లక్షకు విక్రయించేశాడు.

కేస్‌ నెంబర్‌: 4 సంవత్సరం: 2017

నాగమణి, ఆనంద్‌లు కలిసి ఆరిలోవలోని టీఐసీ పాయింట్‌ వద్ద మూడేళ్ల బాలికను అపహరించారు. ఆ పాపను మడగళ లక్ష్మి ఇంటికి మార్చారు. అమ్మకానికి ప్రయత్నించగా బాలిక వయసు ఎక్కువ కావడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక కొత్త నాటకానికి తెరతీశారు. ఆ బాలిక బీచ్‌రోడ్డులో దొరికిందని జోడుగుల్లపాలెం చెక్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. అప్పటికే తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు అందించిన తల్లి వద్దకు బాలికను చేర్చారు.

కేస్‌ నెంబర్‌: 5 సంవత్సరం: 2018

మళ్లీ నాగమణి, ఆనంద్‌లు కలిసి తగరపువలస వద్ద ఓ మహిళ నుంచి రెండేళ్ల బాలుడ్ని అపహరించారు. మడగళ జ్యోతి, చందన దేవిలను మధ్యవర్తులుగా ఆ బిడ్డను నక్కపల్లిలో ఉంటున్న చందాన ఈశ్వరరావుకు రూ. 1.20 లక్షలకు విక్రయించారు.

తొమ్మిది మంది అరెస్టు...

ఈ కేసుల్లో పిల్లల అపహరణకు పాల్పడిన నలుగురితో పాటు వారిని కొనుగోలు చేసిన వ్యక్తులను కూడా నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించామని సీపీ వెల్లడించారు. చిన్నారులను మాత్రం ఛైల్డ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ ఛైర్‌పర్సన్‌ శ్యామలారాణి ఆధ్వర్యంలో సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో డీసీపీ ఉదయ్‌ భాస్కర్‌ బిల్లా, ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ స్వరూపరాణి, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

డబ్బు కోల్పోయి... ఆపై జైలుపాలై...

ఈ కేసుల్లో పిల్లలను కొనుగోలు చేసిన ముగ్గురి పరిస్థితి దయనీయంగా తయారైంది. పిల్లలు కలిగే భాగ్యం లేని వీరంతా మధ్యవర్తుల ద్వారా డబ్బు పోసి పసివాళ్లను కొనుగోలు చేశారు. వారిపై ప్రేమను పెంచుకుని కొన్నాళ్ల పాటు సాకారు. చివరికి ఆ పిల్లలు అక్రమ మార్గంలో తమ చెంతకు చేరారని, ఆ పాపంలో తామూ భాగస్వాములమయ్యామని కుమిలిపోతున్నారు. మరోవైపు ఇన్నాళ్లూ వారి ప్రేమను పొందిన చిన్నారులకు ఒక్కసారిగా పెంపుడు తల్లిదండ్రులు దూరమయ్యే సరికి బిక్కుబిక్కుమంటూ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌కి తరలారు. ఆ సమయంలో పిల్లలంతా ఒక్కసారిగా బోరుమని ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది.Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.