close

తాజా వార్తలు

కశ్మీర్‌లోయలో పడ్డ వాహనం: 16 మంది మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. దోడ జిల్లా సీనియర్ ఎస్పీ ముంతాజ్ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కొండ ప్రాంతమైన మర్మాత్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 16 మంది దుర్మరణం చెందారు. ముగ్గురు వ్యక్తులు గాయాల పాలవగా ఆస్పత్రికి తరలించారు. ఆ వాహనం క్లీనీ ప్రాంతం నుంచి మర్మాత్‌లోని గోవా గ్రామానికి వెళ్తుండగా.. మలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రించ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.