Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146139
            [news_title_telugu_html] => 

భయపడే బదులు బాధపడి.. బాదడం మేలు:కోహ్లీ

[news_title_telugu] => భయపడే బదులు బాధపడి.. బాదడం మేలు:కోహ్లీ [news_title_english] => Its better to get hit early and hard Kohli on bouncers [news_short_description] => బౌన్సర్‌ తగులుతుందేమో అని భయపడటం కన్నా ముందే దెబ్బ తగలించుకొని ఆ నొప్పిని అనుభవించడం మంచిదని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నారు. బౌలర్‌పై ఎదురుదాడి చేసేందుకు ఆ నొప్పి ప్రేరణనిస్తుందని వెల్లడించారు.... [news_tags_keywords] => Virat Kohli,Steve Smith,viv Richards,bcci [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164388176321867781 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 13:50:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భయపడే బదులు బాధపడి.. బాదడం మేలు:కోహ్లీ - Its better to get hit early and hard Kohli on bouncers - EENADU
close

తాజా వార్తలు

భయపడే బదులు బాధపడి.. బాదడం మేలు:కోహ్లీ

మనిద్దరినీ ఎందుకంత కోపంగా ఉన్నావంటారు: వివ్‌ రిచర్డ్స్‌

నార్త్‌సౌండ్‌ (ఆంటిగ్వా) 

బౌన్సర్‌ తగులుతుందేమో అని భయపడటం కన్నా ముందే దెబ్బ తగలించుకొని ఆ నొప్పిని అనుభవించడం మంచిదని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నారు. బౌలర్‌పై ఎదురుదాడి చేసేందుకు ఆ నొప్పి ప్రేరణనిస్తుందని వెల్లడించారు. అలనాటి వెస్టిండీస్‌ దిగ్గజం, భయం తెలియని బ్యాట్స్‌మన్‌ వివ్‌ రిచర్డ్స్‌ను విరాట్‌ ముఖాముఖి చేశారు. యాషెస్‌ సిరీస్‌లో ఆర్చర్‌ విసిరిన రాకాసి బంతి మెడకు తగిలి ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ దిమ్మదిరిగి పడిపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.


ఎదురుదాడికి ప్రేరణ

‘బౌన్సర్‌ ఎక్కడ గాయపరుస్తుందోనని భయపడే కన్నా ముందే దెబ్బ తగిలించుకోవడం మంచిదని అనుకుంటాను. అదీ గట్టిగా! మరోసారి అలా జరగకుండా ఇది నాకు ప్రేరణనిస్తుంది. శరీరమంతా ఆ నొప్పి పాకుతున్నప్పుడు.. సరే! మళ్లీ ఇది చోటుచేసుకోదు’ అని భావిస్తానని కోహ్లీ చెప్పారు. రిచర్డ్స్‌ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు.


భిన్నంగా చూస్తారు

‘ఇదంతా ఆటలో ఒక భాగం. ఇలాంటి గాయాల తర్వాత మనమెలా తిరిగొస్తామన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. గతంలో ఛాతీ భాగంలో చిన్న గార్డ్స్‌ మాత్రమే ఉండేవి. బంతులు తగిలి బాధపడేవాళ్లం. కానీ తప్పదు. ఇదంతా ఆటలో భాగమే’ అని రిచర్డ్స్‌ వెల్లడించారు. ప్రస్తుతం మాలాంటి బ్యాట్స్‌మెన్‌ అందరికీ మీరే గొప్ప స్ఫూర్తి అని విరాట్‌ చెప్పగా.. తమ ఇద్దరిలోని సారూప్యతలను రిచర్డ్స్‌ పేర్కొన్నారు. ‘పోటీకి నేనెప్పుడూ సిద్ధమే అనుకొనేవాడిని. నా సామర్థ్యం మేరకు నన్ను నేను అత్యుత్తమంగా బయట పెట్టుకుంటాను. ఆ అభిరుచి, ఆ సారూపత్యను నీలో చూస్తున్నాను. కొన్నిసార్లు కొందరు మనల్ని భిన్నంగా చూస్తారు. ఎందుకంత కోపంగా ఉన్నావంటారు’ అని విండీస్‌ దిగ్గజం వెల్లడించారు.


ఇది నా ఆట

అత్యంత నాణ్యమైన బౌలింగ్‌ ఉన్నప్పటి శకంలో మీరెందుకు హెల్మెట్‌ ధరించలేదని కోహ్లీ అడిగిన ప్రశ్నకు ‘నేను గొప్పవాడినని నమ్మేవాడిని. మీకు పొగరులా అనిపించొచ్చు. కానీ, నాకు తెలిసిన క్రీడలో భాగమయ్యానని ఫీలయ్యేవాడిని. ప్రతిసారీ నన్ను నేను ప్రోత్సహించుకొనేవాడిని. అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాలని భావించినప్పుడు దెబ్బలు తినడానికీ సిద్ధంగా ఉండేవాడిని. హెల్మెట్‌ ప్రయత్నించినప్పుడు అసౌకర్యంగా అనిపించింది. నాకిచ్చిన మెరూన్‌ టోపీ ధరిచినప్పుడు గర్వంగా భావించేవాడిని. ఆడేందుకు నేను సరిపోతానన్న ఆలోచన ధోరణితో ఉండేవాడిని. ఒక వేళ నేను గాయపడితే అది దేవుడి దయ. క్షేమంగా బయటపడేవాడిని’ అని రిచర్డ్స్‌ తెలిపారు. బీసీసీఐ రిచర్డ్స్‌, కోహ్లీతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో తొలి భాగం ఇది.

 

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.