Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146736
            [news_title_telugu_html] => 

మోదీ విధానాలకు కాంగ్రెస్ నేతల కితాబు

[news_title_telugu] => మోదీ విధానాలకు కాంగ్రెస్ నేతల కితాబు [news_title_english] => Demonising modi is wrong abhishek singvi [news_short_description] => ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతినిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యలకు అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నేత అభిషేక్‌ మను సింఘ్వీ సైతం గొంతు కలిపారు. మోదీని విలన్‌గా చిత్రీకరించడం తప్పని వ్యాఖ్యానించారు.............. [news_tags_keywords] => congress,Modi,Jairam Ramesh,Abhishek Manu Singhvi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 15:28:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మోదీ విధానాలకు కాంగ్రెస్ నేతల కితాబు - Demonising modi is wrong abhishek singvi - EENADU
close

తాజా వార్తలు

మోదీ విధానాలకు కాంగ్రెస్ నేతల కితాబు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతినిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యలకు అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నేత అభిషేక్‌ మను సింఘ్వీ సైతం గొంతు కలిపారు. మోదీని విలన్‌గా చిత్రీకరించడం తప్పని వ్యాఖ్యానించారు. ‘‘మోదీని విలన్‌గా చిత్రీకరించడం తప్పని చెబుతూనే ఉన్నా. ఇది ఒకరకంగా ఆయనకి మేలు చేస్తోంది. విధానాల్లో మంచి, చెడు ఉండొచ్చు. వాటిని అంశాలవారీగానే చూడాలి. వ్యక్తి ఆధారంగా వాటిని అంచనా వేయొద్దు. ఆయన చేపట్టిన అనేక మంచి పనుల్లో ఉజ్జ్వల కార్యక్రమం ఒకటి’’ అని సింఘ్వీ ట్వీట్‌ చేశారు. జైరాం రమేశ్‌ని సైతం ట్వీట్‌కి ట్యాగ్‌ చేయడం గమనార్హం. 

ప్రధాని నరేంద్ర మోదీ అవలంబించే విధానాలు పూర్తిగా వ్యతిరేకించదగ్గవి కాదని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రతిసారి మోదీని విలన్‌ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విపక్షాలకు సూచించారు. ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తించాల్సిన సమయం వచ్చిందని, వాటివల్లే ఆయన కూటమి భారీ మెజార్టీతో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుందని అభిప్రాయపడ్డారు.

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం సమయంలోనూ కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మోదీకి బాసటగా నిలిచిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.