
తాజా వార్తలు
అభివృద్ధి.. అడ్డంకి..పేరుతో వందల ఏళ్ల నాటి వృక్షాలను సైతం క్షణాల్లో కూకటి వేళ్లతో సహా పెకలించి వేయడం మనం చూశాం, చూస్తున్నాం.. కానీ పెరట్లో ‘చెట్టే కదాని కొట్టి పారెయ్యలేదు’ గుంటూరు జిల్లా కొల్లూరుకు చెందిన ఉప్పు వేణు. పాతికేళ్లపాటు తనకు నీడ నిచ్చిన చెట్టు తన బతుకు తెరువు కోసం కొట్టు కట్టుకునేందుకు అడ్డు వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితమే చెట్టును కొట్టులోనే ఉంచి, దాని కింద కొట్టు కట్టించేశాడు. తాపీ మేస్త్రి అయిన అతని కుమారుడు హరిక్రిష్ట ఈ కొట్టును కట్టాడు. అనూహ్యంగా అతడు తండ్రిని వీడి కానరాని లోకాలకు వెళ్లి పోయి.. చెట్టును, నీడను మాత్రం తన కుటుంబ సభ్యులకు మిగిల్చాడు. 35 ఏళ్ల కొడుకు ఏడాదిన్నర కిందట పాము కాటుకు బలయ్యాడు. వాడి గుర్తుగా చెట్టు అలాగే మిగిలి ఉందని అంటున్నారు వేణు.
సుమారు 45 సంవత్సరాల కిందట వేణు పెరట్లో వేప చెట్టు ఒకటి దానంతటదే మొలిచింది. అది పెద్దదై నీడ నిస్తోంది. కాలక్రమంలో తన ఇంటి ఎదురుగా తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు వాటి పక్కనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. దీంతో బతుకు తెరువు కోసం దుకాణం పెట్టుకుందామనే ఆలోచన వచ్చింది. తనకన్నా పదిహేను సంవత్సరాల ముందే తన పెరట్లో పుట్టిన చెట్టును తొలగించకుండా అలాగే ఉంచి వేణు కొడుకు హరికృష్ణ కొట్టు కట్టేశాడు. దాన్ని చూసిన వారు కొట్టులో చెట్టుందా? చెట్టు కింద కొట్టుందా అని ఆశ్చర్యపోతున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
