close

తాజా వార్తలు

అక్కడ ఉచితంగా ‘ఉరీ’ సినిమా స్క్రీనింగ్

ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రయత్నం

అమేథీ: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ఓటర్లలో జోష్‌ నింపడానికి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ వినూత్న ఆలోచనతో ముందుకువచ్చారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మెరుపుదాడుల ఆధారంగా తెరకెక్కిన ‘ఉరీ:ది సర్జికల్ స్ట్రైక్స్‌’  సినిమాను మొబైల్ థియేటర్ల ద్వారా ఉచితంగా నియోజకవర్గ ప్రజలకు చూపించాలనుకుంటున్నారు. దీన్ని మోదీ ప్రభుత్వ విజయంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ మీద పోటీ చేసి స్మృతి ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి పోటీ ఎక్కడి నుంచో అధికారికంగా వెల్లడించకపోయినా, గత కొద్ది కాలంగా ఆమె ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ ప్రాంతంలో గాంధీ మీద ఇరానీ లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఇరానీ అక్కడి ప్రజల ఓట్లు రాబట్టడానికి ఉరీ సినిమాను ఓ అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. దాని ఫలితం ఏ మేరకు ఉంటుందో చూడాలి మరి. బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, యామీ గౌతమ్‌, పరేశ్ రావల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.