Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146247
            [news_title_telugu_html] => టాప్‌ 10 న్యూస్ @ 9 PM
            [news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 9 PM
            [news_title_english] => NINE PM NEWS
            [news_short_description] => 
            [news_tags_keywords] => TOP NEWS,9 PM
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 21:00:32
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
టాప్‌ 10 న్యూస్ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. చిదంబరానికి నాలుగురోజుల కస్టడీ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా  కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ కుషార్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిదంబరం ఈ నెల 26వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాజధానిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై హైకోర్టు స్టే తాత్కాలికమేనని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. అవినీతి అక్రమాలు నివారించి ప్రభుత్వ ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా సీఎం జగన్ రివర్స్‌ టెండరింగ్‌  విధానాన్ని తీసుకువచ్చారని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. రాజధానిని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన.. ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే తెదేపా నేతలు ఉద్యమాలు ఆపగలవా అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్రంలో భారీ ‘విద్యుత్‌’ కుంభకోణం:లక్ష్మణ్‌

ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యల వల్లే దేశంలోని 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ సాధ్యమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా సోలార్ విద్యుదుత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ విద్యుత్‌ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని. భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్‌ జడ్డితో విచారణ జరిపిస్తే పూర్తి వివరాలు బహిర్గతం అవుతాయని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘పోలవరంపై వెంటనే నిర్ణయం తీసుకోండి’

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఎంపీ సుజనాచౌదరి భేటీ అయ్యారు. పోలవరం భవిష్యత్తుపై ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆయనతో పేర్కొన్నారు. పోలవరం రివర్స్‌టెండరింగ్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రిని సుజనా కోరారు. పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘పోలవరం ఆగిపోతుందనే ప్రచారం అవాస్తవం’

పోలవరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అవినీతి, దోపిడీని అరికట్టేందుకే సీఎం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లారని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు తావివ్వకుండా ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని అనిల్‌ స్పష్టం చేశారు. పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. నిర్మాణ పనులపై కాదన్నారు. పోలవరం ఆగిపోతుందంటూ చేస్తోన్న ప్రచారం అవాస్తమని మంత్రి కొట్టిపారేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తలుపులు తెరిచే.. 280 కి.మీ. వేగంతో...

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లకు పెట్టింది పేరు జపాన్‌. భద్రత పరంగా కూడా జపాన్‌ రైల్వేకు ప్రపంచంలోనే మంచి పేరుంది. అయితే, మానవ తప్పిదం కారణంగా తలుపులు మూసుకోకుండానే ఓ బుల్లెట్‌ రైలు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ సమయంలో రైలులో 380 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలులో వాటంతట అవే తలుపులు మూసుకొనే వ్యవస్థ ఉన్నా ఓ బోగీలో మాత్రం మూసుకోలేదు. ఈ విషయాన్ని ఎవరూ పరిశీలించకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇమ్రాన్‌.. మరోసారి అక్కసు బయటపెట్టాడు..

ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాల మీద భారత్‌తో చర్చలు జరపడంపై ఇక ఎటువంటి ఆసక్తి లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌ సంభాషణ తరవాత రోజున ఆయన న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చర్చల కోసం ఆయన చేసిన ప్రయత్నాలను ఏకరవు పెట్టారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, తరవాత చర్చల కోసం తాను చేసిన ప్రయత్నాలన్నింటిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గొలుసు రికవరీకి ‘ఆపరేషన్‌ బనానా’!

మహిళ మెడలో బంగారు గొలుసు దొంగతనం చేసిన వ్యక్తి నుంచి సొత్తు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు కొత్త పద్ధతి అవలంబించారు. ఎట్టకేలకు దాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అందుకోసం ‘ఆపరేషన్‌ బనానా’ చేపట్టి విజయం సాధించారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌ బికనేర్‌లోని గంగాషహర్‌ అనే ప్రాంతంలో మంగళవారం బైక్‌పై వెళ్లిన ఇద్దరు దొంగలు ఓ మహిళ మెడలోంచి గొలుసును అపహరించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కారు కిందపడి ప్రాణాలు దక్కించుకున్నాడు

10. కోచ్‌ ఇంటర్వ్యూలో బంగర్‌ ఉక్కిరి బిక్కిరి!

టీమిండియా ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ముఖాముఖి ముగిసింది. చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ ఆయన్ను గంటకు పైగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిందని సమాచారం. వారి ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు సైతం ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. భారత జట్టు కోచింగ్‌ సిబ్బంది పదవీ కాలం ముగియడంతో కొత్త వారికోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ వారం క్రితమే రవిశాస్త్రిని తిరిగి ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.