close

తాజా వార్తలు

36గంటలు...మహా నిమజ్జనం

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ ప్రధాన శోభాయాత్ర
18 కి.మీ. మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం 12న మధ్యాహ్నం లోపు పూర్తి
ఈనాడు,హైదరాబాద్‌

‘‘హైదరాబాద్‌లో ఏటా ఘనంగా కొనసాగుతున్న మహా నిమజ్జనం సాఫీగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాం. ట్రాఫిక్‌ జాంలు ఉత్పన్నం కాకుండా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించనున్నాం.. ప్రజలు, భక్తులు సహకరించాలి... మహా నిమజ్జనం రోజు 20 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని 36గంటల పాటు మహా నిమజ్జనం కొనసాగనుందని అంచనా వేశాం. ఖైరతాబాద్‌ పెద్ద గణేశ్‌ నిమజ్జనాన్ని గురువారం మధ్యాహ్నం లోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాం’’ అని అదనపు పోలీస్‌ కమిషనర్‌(ట్రాఫిక్‌) అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. మహా నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ విభాగం చేపట్టిన చర్యలను మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అటూ, ఇటూ వెళ్లేందుకు ఒక్కచోటే.. శోభాయాత్ర ప్రారంభం నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకూ ఊరేగింపు మార్గంలో విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలను మినహా ఇతర వాహనాలను పోలీసులు అనుమతించరు. చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, మొజాంజాహీ మార్కెట్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ, హుస్సేన్‌ సాగర్‌ వరకూ ఉన్న ఈ మార్గంలో వాహనచోదకులు, ప్రజలు, ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు లేదు. బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ కింద మాత్రమే వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ అనుమతించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు మినహాయింపు ఇస్తున్నారు. వీరు వెళ్లేందుకు బారికేడ్లను తొలగించనున్నారు.

నిమజ్జనం మరుసటి రోజూ.. ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం గురువారం అర్ధరాత్రి వరకూ పూర్తికాని పక్షంలో శుక్రవారం ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, ఎన్టీఆర్‌మార్గ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు.  ఈ రెండు రోజులూ జీహెచ్‌ఎంసీ టీ-జంక్షన్‌ వద్ద ఉన్న ట్రాఫిక్‌ ఆంక్షలను తాత్కాలికంగా తొలగించనున్నారు.

ప్రజా రవాణాను వినియోగించుకోండి.. ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌కు లక్షల మంది వస్తున్నారు. అందుకే ప్రజారవాణాను వినియోగించుకోవాలని అదనపు పోలీస్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ తెలిపారు. సమావేశంలో ట్రాఫిక్‌ డీసీపీలు ఎల్‌.ఎస్‌.చౌహాన్‌, కె.బాబూరావు, అదనపు డీసీపీ భాస్కర్‌, ఏసీపీ రామలింగరాజు, ఇన్‌స్పెక్టర్‌ కె.వి.పిరాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.