Mumbai Vs Hyderabad: హైదరాబాద్‌ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్‌కు ముంబయి ఎసరు పెడుతుందా ?

ఐపీఎల్‌లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్‌ జరగనుంది. హైదరాబాద్‌తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది.

Updated : 06 May 2024 14:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో వాంఖడే వేదికగా ముంబయి - హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ముంబయికి ఈ మ్యాచ్‌ ఫలితంతో ప్రయోజనం లేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.

  • ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు 277/3 ముంబయిపై హైదరాబాద్‌ చేసినదే. సన్‌రైజర్స్ త్రయం అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ దూకుడుకు ముంబయి బౌలర్లు బలైన సంగతి తెలిసిందే. 
  • ముంబయి - హైదరాబాద్‌ జట్లు 22 మ్యాచుల్లో తలపడ్డాయి. ముంబయి 12, సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో గెలిచాయి. వాంఖడేలో మాత్రం ముంబయిదే ఆధిపత్యం. 
  • వాంఖడే పిచ్‌ బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించదు. అయితే, గత మ్యాచ్‌ ఫలితాన్ని చూస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. 170 పరుగుల టార్గెట్‌ను కూడా ముంబయి ఛేదించలేకపోయింది. 
  • అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హైదరాబాద్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (396) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్ (337) 15వ స్థానంలో ఉన్నాడు. ముంబయి నుంచి ఒక్క బ్యాటర్‌ కూడా టాప్‌ -15లో లేకపోవడం గమనార్హం.
  • పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్న జస్‌ప్రీత్‌ బుమ్రా (17 వికెట్లు) నుంచి ముంబయి మరోసారి అద్భుత బౌలింగ్‌ ఆశిస్తోంది. ఈ పర్పుల్ రేసులో హైదరాబాద్ పేసర్ నటరాజన్ (15) నాలుగో స్థానంలో ఉన్నాడు. 
  • ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబయి తన స్టార్‌ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందనే వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబతున్నారు. 
  • ప్రస్తుతం ముంబయి 11 మ్యాచుల్లో మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. హైదరాబాద్‌ 10 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది.
  • మరోసారి ముంబయితో మ్యాచ్‌ కావడంతో ‘300’ స్కోరును చూస్తామా? అనే ఆశలు హైదరాబాద్‌ అభిమానుల్లో నెలకొంది.
  • ముంబయి (తుది జట్టు అంచనా): ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధిర్, టిమ్‌ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పీయూశ్‌ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా
  • హైదరాబాద్‌ (తుది జట్టు అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్‌మోల్‌ ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీశ్‌ రెడ్డి, అబ్దుల్ సమద్, షహబాజ్‌ అహ్మద్, మార్కో యన్‌సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని