icon icon icon
icon icon icon

నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు

తన రెండో అల్లుడు డాక్టర్‌ గుండబోలు గౌతమ్‌ మాటల వెనుక పవన్‌కల్యాణ్‌ ఉన్నారని, అతడిని రెచ్చగొట్టి వీడియో చేయించారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

Updated : 06 May 2024 06:20 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: తన రెండో అల్లుడు డాక్టర్‌ గుండబోలు గౌతమ్‌ మాటల వెనుక పవన్‌కల్యాణ్‌ ఉన్నారని, అతడిని రెచ్చగొట్టి వీడియో చేయించారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కీలకమైన ఎన్నికల సమయంలో తన దృష్టిని మరల్చేందుకు పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ కలిసికట్టుగా నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైకాపా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన రెండో కుమార్తె డాక్టర్‌ మనోజ్ఞ, అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ మధ్య నాలుగేళ్లుగా విభేదాలు ఉన్నాయని తెలిపారు. రెండేళ్లుగా మనోజ్ఞతోపాటు ఆమె కుమార్తె, కుమారుడు తన సంరక్షణలోనే ఉన్నారని, వారికి అల్లుడి నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పారు. గౌతమ్‌ వ్యాఖ్యలపై స్పందించే వాడిని కాదని, పొన్నూరులో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మంత్రి రాంబాబుకు సొంత అల్లుడే ఓటు వేయవద్దని చెబుతున్నాడని అనడంతో స్పందించాల్సి వచ్చిందన్నారు. ఎవరి కుటుంబంలో వివాదాలు లేవు? అందరి కుటుంబాల్లోని వివాదాలు ఉన్నాయని అంబటి అన్నారు. గౌతమ్‌ తన కుమార్తెను బెదిరించి విడాకులు ఇవ్వాలని కోరారని, కుమార్తెతోపాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం తాను ఫైట్‌ చేస్తున్నానని మంత్రి తెలిపారు.

మా మామ అంబటికి ఓటేయొద్దు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img