icon icon icon
icon icon icon

ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!

ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఒకరినొకరు పరిహసించుకున్నా.. ఏదో ఒక సందర్భంలో ఎదురుపడితే మాత్రం ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆత్మీయతను పంచుకుంటున్నారు కొందరు అభ్యర్థులు.

Updated : 06 May 2024 07:52 IST

పాలకొల్లు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఒకరినొకరు పరిహసించుకున్నా.. ఏదో ఒక సందర్భంలో ఎదురుపడితే మాత్రం ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆత్మీయతను పంచుకుంటున్నారు కొందరు అభ్యర్థులు. ఇలాంటి ఘటనే పాలకొల్లులో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైకాపా ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాలకొల్లులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం ఎదురు పడ్డారు. సోదరభావంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటుండగా ‘న్యూస్‌టుడే’ తీసిన చిత్రమిది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఉమాబాలతో కరచాలనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img