Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 06 May 2024 13:01 IST

1. పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్

పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో గర్భిణిపై వైకాపా నేతల దాడిని ఆయన ఖండించారు. తాగునీరు అడగటమే ఆమె చేసిన పాప‌మా అని ప్రశ్నించారు. నిండు గ‌ర్భిణి అని చూడ‌కుండా అమాన‌వీయ దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

2. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తానూ ఇబ్బందులు పడ్డానని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ (PV Ramesh) తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో #LandTitlingAct హ్యాష్‌ ట్యాగ్‌తో ఆయన పోస్ట్‌ చేశారు.పూర్తి కథనం

3. డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్లు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మహిళలు ఆయన్ను నిలదీశారు. చాలా రోజుల నుంచి సరైన రోడ్లు లేవని, మట్టి రోడ్లతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు. తాగునీటి పైప్‌లైన్‌ లీకై నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.పూర్తి కథనం

4. అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు మాకు తెలియదు: వైఎస్‌ షర్మిల

తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వివేకా హత్య కేసుపై మాట్లాడుతూ జగన్‌ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని గుర్తుచేశారు.పూర్తి కథనం

5. హౌస్‌ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!

సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో.. ఝార్ఖండ్‌(Jharkhand)లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. అదంతా లెక్కల్లోకి రాని సొమ్ము అని, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ.20 కోట్లుపైనే ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) వర్గాలు మీడియాకు వెల్లడించాయి.పూర్తి కథనం

6. 33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ

కర్ణాటకలో ఆ నియోజకవర్గం ప్రత్యేకం. రెండు కుటుంబాల మధ్యే ప్రధాన పోటీ. రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబాల నుంచి నేతలు ఇక్కడ పోటీపడుతున్నారు. 33 ఏళ్లుగా ఈ రాజకీయ వైరం కొనసాగుతున్న ఆ నియోజకవర్గమే శివమొగ్గ. షిమోగ అని కూడా పిలుస్తారు.పూర్తి కథనం

7. ఇండీజీన్‌ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం

ఆరోగ్యసంరక్షణ రంగంలోని సంస్థలకు సాంకేతిక సేవలు అందించే ఇండీజీన్‌ లిమిటెడ్ ఐపీఓ సోమవారం ప్రారంభమైంది. రూ.1,842 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. మే 8న పబ్లిక్‌ ఇష్యూ ముగియనుంది. ధరల శ్రేణి రూ.430-452గా నిర్ణయించింది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాలి.పూర్తి కథనం

8. కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్

కోల్‌కతా చేతిలో ఘోర ఓటమితో లఖ్‌నవూ ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనుకబడింది. భారీ లక్ష్య ఛేదనలో విఫలమైన లఖ్‌నవూ 98 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన 235/6 స్కోరు సాధించగా.. లఖ్‌నవూ 137 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలం కావడంపై కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) కీలక వ్యాఖ్యలు చేశాడు.పూర్తి కథనం

9. దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు

మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.పూర్తి కథనం

10. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా కారణం

కోటిపైగా జనాభా, మెట్రో నగరం, ఐటీకి ముఖ్య కేంద్రం, ఎందరో వలస జీవులకు ఉపాధి చూపే భాగ్యనగరం. హైదరాబాద్ పేరు చెబితే వినిపించే పేర్లు ఇవి. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నగరంలో ప్రమాదకర కాలుష్య పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయని తాజా అధ్యయనంలో తేలింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని