close

తాజా వార్తలు

హెల్మెట్‌ లేదని బస్సు డ్రైవర్‌కు చలానా!

నొయిడా: నూతన వాహనచట్టం అమల్లోకి వచ్చాక చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించలేదని ఓ బస్సు యజమానికి రూ.500 జరిమానా విధించిన ఘటన నొయిడాలో చోటుచేసుకుంది. నొయిడాకు చెందిన నిరంకర్‌ సింగ్‌ ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ యజమాని. సుమారు 80 బస్సులు ఉన్నాయి. అద్దె ప్రాతిపదికన స్కూళ్లు కార్యాలయాలకు ఇస్తుంటారు.

అందులోని ఓ స్కూల్‌ బస్సుకు.. డ్రైవర్‌  హెల్మెట్‌ ధరించని కారణంగా రూ.500 జరిమానా విధించారని సింగ్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 11న గౌతమ్‌ బుద్ధ నగర్‌ పోలీసులు ఈ చలానా రాసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలోనూ ఏం తప్పిదం చేశామో తెలపకుండా ఒకేరోజు మూడు ఫైన్లు ఎదుర్కొన్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందిస్తూ.. జరిమానా వేసే సందర్భంలో మానవ తప్పిదం జరిగి ఉంటుందని వివరణ ఇచ్చారు. త్వరలో సరిచేసిన జరిమానా యజమానికి పంపుతామని తెలిపారు. ఇదే యజమాని నాలుగు పెండింగ్‌ చలాన్లు చెల్లించాల్సి ఉందని ట్రాఫిక్‌ ఎస్పీ అనిల్‌కుమార్‌ ఝా తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
Saket Pranamam
tsmbanner
VITEEE 2020
besttaxfiler
dr madhu

Panch Pataka

దేవతార్చన