close

తాజా వార్తలు

ఐదో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

నేడు అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌: ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఐకాస చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. ఆందోళనను మరింత ఉద్ధృతం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్న ఐకాస.. పోరాటంతో ఉద్యోగ, ప్రజా సంఘాలను భాగస్వాములను చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఐకాస నేతలు నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా, వివిధ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈనెల 5 నుంచి కార్మికులు సమ్మెబాట పట్టారు. అయితే సమ్మెపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో కార్మిక సంఘాలు భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. డిపోల ముందు బతుకమ్మ ఆడటం.. సెమి పూజలు చేయడం ద్వారా ఇప్పటికే నిరసన వ్యక్తం చేసిన కార్మికులు పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇవాళ ఆర్టీసీ ఐకాస కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయపక్షాలను ఆహ్వానించినట్లు ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఈ భేటీకి అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కూడా హాజరుకావాలని ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు.

మరింత పెరగనున్న రద్దీ

దసరా పండుగ ముగియడంతో ప్రయాణికులు తిరుగు పయనమవుతున్నారు. ఇవాళ, రేపు ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుంది. వరంగల్‌-హైదరాబాద్‌ మార్గంలో ఇప్పటికే రద్దీ ఎక్కువతోంది. వరంగల్‌ డివిజన్‌లో 601 బస్సులకుగాను, 309 బస్సులను అధికారులు తిప్పుతున్నారు. నల్గొండ పరిధిలో 120 ఆర్టీసీ, 112 అద్దె బస్సులు నడుస్తున్నాయి. మొత్తం 830 బస్సులకుగాను 232 బస్సులను అధికారులు తిప్పుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రామగుండం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. రామగుండం డివిజన్‌లోని 1, 2, 3 ఏరియా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.