close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేటి నుంచి షెడ్యూల్‌ ప్రకారం బస్సు సర్వీసులు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో అధికారులు తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడిపిస్తున్నారు. నేటి నుంచి షెడ్యూల్‌ ప్రకారం బస్సులు నడవనున్నాయి. కొన్నిచోట్ల టికెట్‌ ధర కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తుండటంతో ప్రతి బస్సులోనూ ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల్లో విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగుల బస్‌పాసులను అనుమతించనున్నారు. 

2. కంటి వెలుగుకు నేడే శ్రీకారం

ఏపీలో అంధత్వ నివారణలో భాగంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా... డా.వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ గురువారం అనంతపురం జిల్లాలో ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పొరుగు సేవకులకు శుభవార్త

పొరుగు సేవల ఉద్యోగాల నియామకాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పచ్చజెండా ఊపారు. ఈ నియామకాల్లో మహిళలకు 50% కేటాయించాలని ఆదేశించారు. సాధారణ పరిపాలనశాఖ ఆధ్వర్యంలో ఎలాంటిలాభాపేక్ష లేకుండా కార్పొరేషన్‌ పని చేస్తుందని సీఎం కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పీఆర్‌సీకి అదనపు బాధ్యతలు

తెలంగాణ తొలి వేతన సవరణ సంఘాని(పీఆర్‌సీ)కి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అన్ని శాఖల ఉద్యోగులకు కొత్త సేవా నిబంధనల(సర్వీసు రూల్స్‌) రూపకల్పన కోసం సిఫార్సులు చేయాలని సూచించింది. పాలనా సంస్కరణలు, జవాబుదారీతనం పెంపుదల, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నగరపాలికలు, పురపాలక సంస్థలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంపు, పోస్టులకు కొత్త పేర్లు పెట్టడానికి సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. పురచట్టంలో సవరణలకు గవర్నర్‌ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర కొత్త పురపాలక చట్టంలో సవరణలకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. ఇటీవలి శాసనసభ సమావేశాల్లో ఉభయ సభలు ఈ సవరణలను ఆమోదించాయి. ఈ మేరకు చట్టాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం ఆమోదించారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం గెజిట్‌ ప్రచురణకు న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 

6. 22 ఏళ్లుగా విడిగా ఉన్న దంపతులకు విడాకులు

ఏకంగా 22 ఏళ్ల నుంచి విడివిడిగా జీవిస్తున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులకు సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారిద్దరి వివాహబంధం విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు చేసిన యత్నాలన్నీ విఫలమయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. జయ నెచ్చెలి శశికళకు రాజభోగం నిజమేనట!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలు నిజమేనని నిజ నిర్ధారణ సమితి వెల్లడించింది. పరప్పన అగ్రహార కారాగారంలో శశికళకు ఏకంగా 5 గదుల సెల్‌ను కేటాయించారని, ప్రత్యేక సదుపాయాల కోసం భారీ మొత్తంలో చేతులు మారాయని గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ప్రముఖులపై దేశద్రోహం  కేసు మూసివేతకు ఆదేశాలు!

చరిత్రకారుడు రాంచంద్ర గుహా, చలనచిత్రరంగ స్రష్టలు శ్యామ్‌ బెనెగల్‌, మణిరత్నం, అనురాగ్‌ కశ్యప్‌ తదితర 49 మంది ప్రముఖులపై దాఖలైన దేశద్రోహం కేసును మూసివేయాల్సిందిగా ఆదేశించినట్లు ముజఫర్‌పుర్‌ పోలీసు సీనియర్‌ సూపరింటెండెంట్‌ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. 

9. ఇక వాట్సప్‌ సందేశాలు మాయం!

‘వాట్సాప్‌’ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మనం పంపిన, మనకొచ్చిన సందేశాలను పనిగట్టుకుని తొలగించుకోవాల్సిన పని ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే... పరిమిత సమయం దాటిన ఆయా సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సౌలభ్యాన్ని వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. పుణెలోనే తేల్చేస్తారా..!

విశాఖలో విజయంతో ఉత్సాహం ఉరకలేస్తుంటే.. కోహ్లీసేన రెట్టించిన విశ్వాసంతో సఫారీలతో మరో సమరానికి సిద్ధమైపోయింది. నేటి నుంచే దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సిరీస్‌ చేజిక్కించుకోవాలని భారత్‌ తహతహలాడుతుంటే.. ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.