Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146704
            [news_title_telugu_html] => 

త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

[news_title_telugu] => త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు [news_title_english] => SC issues notice to Centre on plea against Triple Talaq [news_short_description] => ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ తీసుకొచ్చిన కొత్త  చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన [news_tags_keywords] => Triple Talaq,Supreme Court,Centre [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => STicfmzpq8U [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 12:00:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు - SC issues notice to Centre on plea against Triple Talaq - EENADU
close

తాజా వార్తలు

త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

చట్టం చెల్లుబాటును పరిశీలిస్తామన్న న్యాయస్థానం

దిల్లీ: ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ తీసుకొచ్చిన కొత్త  చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2019 రాజ్యాంగవిరుద్ధంగా ఉందని, రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాన్ని న్యాయస్థానం పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక.. కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌కు తెలిపింది. 

ముమ్మారు తలాక్‌ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే తీర్పునిచ్చినా, ఇంకా అది కొనసాగుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ చట్టం విషయంలో ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జులైలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో చట్టం అమల్లోకి వచ్చింది. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.