close

తాజా వార్తలు

సరిహద్దులో మళ్లీ పాక్‌ డ్రోన్ల కలకలం

పంజాబ్‌: సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని హుస్సేనివాలా సెక్టారులో పాక్‌ డ్రోన్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా  ఆ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌ పరిధిలోని ఝూగే హజారా సింగ్‌ గ్రామం వద్ద  రెండు డ్రోన్లు కలియతిరగడం మరోసారి కలకలం రేపింది. ఆ డ్రోన్లు పాక్‌ వైపు నుంచి వచ్చినట్లు హజారాసింగ్‌ గ్రామస్థులు తెలిపారు. భారత సరిహద్దులో ఉన్న ఈ గ్రామం వద్ద కొంతసేపు డ్రోన్లు చక్కర్లు కొట్టినట్లు ఆ గ్రామస్థులు సరిహద్దు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు.

దీంతో పంజాబ్‌ పోలీసులతో కలిసి భద్రతాదళాలు ఆ  డ్రోన్ల కోసం గాలిస్తున్నాయి. అనుమానాస్పదంగా డ్రోన్లు తిరుగుతున్నట్లయితే వెంటనే సమాచారమివ్వాలని స్థానికులకు పోలీసులు సూచించారు. రెండు రోజులక్రితం ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేని వాలా సెక్టార్‌లోనూ ఓ డ్రోన్‌ అర్ధరాత్రి సమయంలో చక్కర్లు కొట్టింది. తర్వాత కొంత సేపటికి భారత సరిహద్దును కూడా దాటింది.  



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.