close
వైభవంగా కార్తీక వన భోజన మహోత్సవం

సింగపూర్‌: సింగపూర్‌లోని వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాసవీక్లబ్‌ సభ్యులందరూ కలిసి సింగపూర్‌కు దగ్గర్లోని కూసు ద్వీపానికి వెళ్లి అక్కడ సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకుని గణపతి పూజ, శివాష్టకం చేశారు. కార్యక్రమంలో సుమారు 130 మంది పాల్గొని ఆనందోత్సాహాలతో ఈ వేడుకను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్‌ సింగపూర్‌ అధ్యక్షుడు గొట్లూరు అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కార్తీక మాస వనభోజన విశిష్టతను తెలియజేశారు. పిల్లలకు ఆచార వ్యవహారాలు తెలియజేయడంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు.

ప్రధాన కార్యదర్శి నరేంద్రకుమార్‌ నారంశెట్టి మాట్లాడుతూ.. వాసవీమాత చెప్పిన దాన ధర్మాలు కొనసాగించాలని ఎల్లప్పుడూ అందరూ ప్రేమానురాగాలతో ఐక్యతతో ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా చార్టెడ్‌ ప్రెసిడెంట్‌ వెంకటనాగరాజు కైలా మరికొంతమంది పెద్దల చేతుల మీదుగా లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వాసవీ సేవాదళ్‌ సభ్యులు రాజా విశ్వనాథుల, మురళి పబ్బతి, కిశోర్‌ ముక్క, కోట సతీష్‌, గాజులపల్లి అరవింద్‌, ఆలపాటి రాఘవ, బచ్చు సత్యనారాయణ, కిశోర్‌, సుమన్‌, కృష్ణ, సంతోష్‌, నాగరవి, విష్ణు, నిత్య, చలం, విఘ్నేష్‌, సరిత తదితరులు పాల్గొన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని