మీరన్నా ఒత్తిడి లేకుండా పనిచేయండి

తాజా వార్తలు

Published : 30/07/2020 02:55 IST

మీరన్నా ఒత్తిడి లేకుండా పనిచేయండి

కొత్త ‌పీసీసీ చీఫ్‌కు సచిన్‌ అభినందనలు

దిల్లీ/జైపుర్: తనను పదవుల నుంచి తొలగించిన తర్వాత రాజస్థాన్‌ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తొలిసారిగా స్పందిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేసిన కార్యకర్తలను కొత్త రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఆర్‌పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గోవింద్ సింగ్ దోస్తారాకు నా శుభాకాంక్షలు. ఇప్పటికైనా ఆయన ఎలాంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు శ్రమించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూ వారిని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోఖ్ గహ్లోత్‌తో విభేదాల కారణంగా తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్‌ తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్‌ రాజకీయాల్లో సంక్షోభం మొదలైంది. రెండు సార్లు నిర్వహించిన పీసీసీ సమావేశానికి సచిన్‌ పైలట్ హాజరుకాకపోవడంతో ఆయన్ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో సచిన్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ అనర్హత నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సచిన్‌ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అనర్హత నోటీసులపై యథాస్థితిని కొనసాగించాలని తీర్పు వెలువరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని