పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌!
close

తాజా వార్తలు

Updated : 21/02/2021 17:26 IST

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌!

పుదుచ్చేరి: బలపరీక్షకు ఒక రోజు ముందు పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కూటమికి షాకిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణన్‌తో పాటు, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే వెంకటేశన్‌ తమ పదవులకు ఆదివారం రాజీనామాలు సమర్పించారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో మైనారిటీలో పడిన నారాయణస్వామి సర్కారును అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా.. ఈ పరిణామం చోటుచేసుకోవడంతో కాంగ్రెస్‌ మరింత ఇరకాటంలో పడింది.

పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్‌, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్‌దాన్‌ రాజీనామా చేసి భాజపాలో చేరారు. అనంతరం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్‌కుమార్‌ రాజీనామాలు చేశారు. తాజాగా మరో ఇద్దరి రాజీనామాతో కూటమి బలం 12కు చేరింది. మరోవైపు ఎన్నార్‌ కాంగ్రెస్‌ (7), అన్నాడీఎంకే (4), భాజపా (3 నామినేటెడ్‌)తో కూడిన కూటమి బలం 14గా ఉంది. సభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 26కు చేరింది. రేపు సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష జరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని