కొనుగోలు కేంద్రాల రద్దు సరైనది కాదు: భట్టి

తాజా వార్తలు

Updated : 10/01/2021 13:02 IST

కొనుగోలు కేంద్రాల రద్దు సరైనది కాదు: భట్టి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.తెరాస నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళతామన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసిన సందర్భంగా అయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి నూతన వ్యవసాయ చట్టాలతో ప్రమాదం ఉందని భట్టి అన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించడం సరైనది కాదన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రూ.4 లక్షల వరకు విరాళాలు సేకరించామని, దీంతోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నెల జీతం జోడించి దిల్లీ రైతులకు ఇస్తామని భట్టి వెల్లడించారు. సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని భట్టి స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని