ఎంపీ రఘురామ అరెస్టు: హైకోర్టులో నేడు విచారణ 
close

తాజా వార్తలు

Published : 15/05/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీ రఘురామ అరెస్టు: హైకోర్టులో నేడు విచారణ 

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు నేటి మధ్యాహ్నం విచారణ జరపనుంది. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచవద్దని హైకోర్టు తెలిపింది. సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణరాజుకు సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆహారం, వైద్యం, వసతికి వెసులుబాటు కల్పించాలని కోర్టు పేర్కొంది.  

మరోవైపు,  ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగంకలిగించేలా వ్యాఖ్యానించారన్న అభియోగంపై ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయన్ను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. సీఐడీ డీఐజీ సునీల్‌ కుమార్‌ గుంటూరుకు చేరుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని