TS News: హుజూరాబాద్ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు వీళ్లే 

తాజా వార్తలు

Updated : 14/07/2021 10:58 IST

TS News: హుజూరాబాద్ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు వీళ్లే 

హైదరాబాద్‌: భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియమించారు. నియోజకవర్గ ఎన్నికల బాధ్యుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ, ఎన్నికల సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను ప్రకటించారు. కంట్రోల్‌ రూమ్‌ సమన్వయకర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ అందుబాటులో ఉండనున్నారు. 

మండలాల వారీగా బాధ్యులు..
వీణవంక: ఆది శ్రీనివాస్‌, సింగీతం శ్రీనివాస్‌

జమ్మికుంట: విజయ రమణారావు, రాజ్‌ఠాగూర్‌

హుజూరాబాద్‌: టి.నర్సారెడ్డి, లక్ష్మణ్‌కుమార్‌

హుజూరాబాద్‌ టౌన్‌: బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు

ఇల్లంతకుంట: నాయిని రాజేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి

కమలాపూర్‌: కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని