ఆక్సిజన్‌ కొరత కాదు.. సర్కారు నిర్లక్ష్యం వల్లే..!
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 04:13 IST

ఆక్సిజన్‌ కొరత కాదు.. సర్కారు నిర్లక్ష్యం వల్లే..!

దిల్లీ: కొవిడ్ 19 సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో దేశంలో వైరస్‌ బాధితులెవరూ చనిపోలేదంటూ వెల్లడించిన కేంద్రంపై కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మండిపడ్డారు. ఆక్సిజన్‌ లేక కాదు.. దానిని అందజేయడంలో కేంద్రం అనుసరించిన నిర్లక్ష్య ధోరణితోనే చాలా మంది ప్రాణాలు కోల్పాయారని ఆమె ఆరోపించారు. నిజానికి మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశంలో ఆక్సిజన్‌ ఎగుమతులను ప్రభుత్వం 700 శాతం పెంచిందన్నారు. కానీ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు కేంద్రం రవాణా సదుపాయం కల్పించకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయంటూ విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ సలహాలను సైతం కేంద్రం విస్మరించిందంటూ మండిపడ్డారు. రోగులకు ఆక్సిజన్ అందించడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని ఆరోపించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు దిశగా కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

కొవిడ్ సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలు సమర్పించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో వెల్లడించింది. కేంద్రం చేసిన ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని