AP Politics: తెదేపా నేతల గృహ నిర్బంధం

తాజా వార్తలు

Updated : 24/05/2021 09:58 IST

AP Politics: తెదేపా నేతల గృహ నిర్బంధం

అమరావతి: ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్‌ బాధితులకు భరోసా కార్యక్రమానికి తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతుండగా వారిని నిర్బంధించారు. 

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా శాసన సభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఉంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరులో తెదేపా ఇన్‌ఛార్జ్‌ బడేటి రాధాకృష్ణ, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి,  ప్రొద్దుటూరులో సీనియర్‌ నేత లింగారెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని